ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి*
*-మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి*
*- పెండింగ్ కేసుల పరిష్కారంపై ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఆదేశాలు*
*యాదాద్రిభువనగిరి, ప్రతినిధి మేజర్ న్యూస్*
మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ సూచించారు. బాధితులకు సత్వర సహాయం అందించడంతోపాటు, భరోసా కేంద్రం సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, పనితీరు, నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. భరోసా కేంద్రానికి అవసరమైన ఆర్థిక వనరులు, బాధితులకు అందిస్తున్న సేవలు, ఐటీఎస్‌ఎస్‌ఓలో పెండింగ్‌లో ఉన్న కేసులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ, బాధితులకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించారు.సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ హనుమంత్ నాయక్,భరోసా ఎస్‌ఐ సంధ్య తదితరులు పాల్గొన్నారు.