BREAKING
చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం జల సంరక్షణపై విద్యార్థుల బృహత్తర కార్యక్రమం* బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. 30 కోట్ల దిశగా 'ఉడ్తా తీర్' వసూళ్లు! సమస్యలు లేని డివిజన్ గా మారుస్తా.. -63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి హామీ సాగునీరు సాధనకై ఉద్యమించాలి పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడుగా కేశవమూర్తి ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...మండల కార్యదర్శి, సైదులు సిపిఐఎం ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... 54వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి విషాదం.. ఆత్మహత్య చేసుకున్న పారా ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ యాదవ్! గిరిజన ప్రాంతాల్లోని 7 గ్రామాల్లో రక్తహీనత సర్వే పూర్తి చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. లేడీస్ కామన్ హాల్ తొలగించే ప్రయత్నం దారుణం ప్రతి గడపలో టిడిపి నినాదం -తిరుపతిలో కూటమి జెండా ఎగరాల్సిందే -నగర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది అన్నా మల్లీశ్వరి గెలుపు కోసం తుడా చైర్మన్ గడపగడపకు ప్రచారం

సరళ మైసమ్మ దేవాలయ వివాదంపై సంయుక్త విచారణ

Select Suryaa Now
సరళ మైసమ్మ దేవాలయ వివాదంపై సంయుక్త విచారణ

 

సంస్థాన్ నారాయణపురం మేజర్ న్యూస్: మండల పరిధిలోని రాచకొండ రెవెన్యూ పరిధిలో ఉన్న సరళ మైసమ్మ దేవాలయ కమిటీ వివాదంపై దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు బుధవారం సంయుక్త విచారణ చేపట్టారు. వివాదం శాంతిభద్రతల సమస్యగా మారడంతో దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని పోలీసులు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది.

నల్లగొండ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బృందం, చౌటుప్పల్ ఆర్డీవో ఇరు వర్గాల వాదనలు విన్నారు. దేవాలయంలో హుండీల ఏర్పాటు, భక్తుల నుంచి డబ్బుల వసూలు, ప్రభుత్వ భూమిలో నిర్మాణం తదితర అంశాలను పరిశీలించారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు. దేవాలయం ఉన్న ప్రాంతాన్ని అల్లాపురంగా పేర్కొనడంపై వచ్చిన అభ్యంతరాలనూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారి  వెంట నారాయణపురం మండల దేవాదాయ శాఖ ఈవో వెంకటరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మమత, ఆర్ ఐ పాండు, చౌటుప్పల్ రూరల్, టౌన్ సీఐలు మన్మధ కుమార్, సతీష్ రెడ్డి, స్థానిక ఎస్‌ఐ సీత పాండు తదితరులు పాల్గొన్నారు