ప్రతి గడపలో టిడిపి నినాదం -తిరుపతిలో కూటమి జెండా ఎగరాల్సిందే -నగర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది అన్నా మల్లీశ్వరి గెలుపు కోసం తుడా చైర్మన్ గడపగడపకు ప్రచారం
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో ఎన్డీఏ కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి గడపలో టిడిపి నినాదం నింపేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టింది.కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి బరిలో దిగిన మేయర్ జేబీ శ్రీనివాస్, కార్పొరేటర్ అభ్యర్థులు గెలుపుతో టిడిపి జెండా ఎగిరేందుకు ఆ పార్టీ నేతలు నిరంతరం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జీవకోనలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వయంగా రంగంలో దిగారు. ఈ సందర్భంగా జీవకోనకు చేరుకున్న ఆయనకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత, అన్నా రామకృష్ణ, స్థానిక కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 64, 66వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అన్న మల్లీశ్వరి గెలుపు లక్ష్యంగా ప్రతి గడపకి వెళ్లి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోరారు.
నగర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలో మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉందని, రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి తరఫున బరిలో దిగిన మేయర్ అభ్యర్థి, జేబీ శ్రీనివాస్ కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించి, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తాం. అన్నా మల్లీశ్వరి, అన్నా లోకేష్, మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కు ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి, కాయం వెంకటరత్నం, శ్రీనివాస్ యాదవ్, టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్