BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

గిరిజన ప్రాంతాల్లోని 7 గ్రామాల్లో రక్తహీనత సర్వే పూర్తి చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.

Select Suryaa Now
గిరిజన ప్రాంతాల్లోని 7 గ్రామాల్లో రక్తహీనత సర్వే పూర్తి చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.

     నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్....
గిరిజన ప్రాంతాలలోని   గుర్తించిన 7 గ్రామాలలో  రక్తహీనత సర్వేను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సర్వేలో రక్తహీనతతో బాధపడుతున్న  వారిని గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై సీడీపీఓలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు.గిరిజన ప్రాంతాలలో రక్తహీనత సమస్య తీవ్రతను తెలుసుకునేందుకు సమగ్ర సర్వే నిర్వహించి, బాధితుల వివరాలను సేకరించాలని , గిరిజన సంక్షేమ కమిటీ గుర్తించిన 7 గ్రామాలలో 18 సంవత్సరాలలోపు బాలికలు, మహిళలకు రక్తహీనత సర్వేను నిర్వహించాలని ఆదేశించారు.
సర్వే ఫలితాల ఆధారంగా అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు.జిల్లాలో మంజూరైన 41 నూతన అంగన్‌వాడీ కేంద్రాలకు సోమవారం లోగా శంకుస్థాపన చేయాలని , నిర్ణీత గడువులోగా పనులు ప్రారంభించని కేంద్రాలకు తిరిగి అనుమతులు మంజూరుచేయబోమని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బియ్యం సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పారు. పోషణ్ కార్యక్రమంలో భాగంగా బాలామృతం పంపిణీ, పోషకాహార కార్యక్రమాల అమలును మెరుగుపరచాలన్నారు. 0-5  సంవత్సరాల వయస్సు గల పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి బరువు, ఎత్తు తదితర వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసి పర్యవేక్షించాలని తెలిపారు.
సీడీపీఓలు మండల స్థాయిలో సోమవారం సమావేశాలు నిర్వహించి, కార్యక్రమాల అమలుపై సమీక్షించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల అభివృద్ధికి సంబంధించిన అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేందుకు మెరుగైన బోధనా పద్ధతులను అమలు చేయాలని, పిల్లలకు బోధించే బాధ్యత అంగన్‌వాడీ టీచర్లదేనని, ఆయాలు పిల్లలకు పాఠాలు బోధించకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత టీచర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పోషకాహారంతో పాటు, మెరుగైన విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్  ఆదేశించారు. 
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విటమిన్‌-ఏ అవసరమైన యాంటీబయాటిక్స్‌, ఫోలిక్‌ యాసిడ్‌, సిరప్‌లతో పాటు, 5 రకాల ముఖ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. 
చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, మహిళలకు అవసరమైన వైద్య సేవలు నిరంతరం అందేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఓటరు జాబితా  ప్రత్యేక సమగ్ర సవరణ అమలులో అంగన్‌వాడీ టీచర్లు చేస్తున్న కృషిని కలెక్టర్అభినందించారు.ఈ సమావేశానికి స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి ,
శిశు సంక్షేమ శాఖ అధికారి లావణ్య ,  సిపిడిఓలు, సూపర్వైజర్లు హాజరయ్యారు.