లేడీస్ కామన్ హాల్ తొలగించే ప్రయత్నం దారుణం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ పరిపాలనా భవనంలో మహిళ ఉద్యోగుల కోసం యూజీసీ ఏర్పాటు చేసిన లేడీస్ కామన్ హల్ ను అధికారులు తొలగించే ప్రయత్నం చేయడం దారుణమని మహిళా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలోని మహిళా ఉద్యోగుల కోసం బేసిక్ ఫెసిలిటీస్ ఫర్ ఉమెన్ పేరుతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గది గత రెండేళ్లుగా ఉద్యోగినులకు అందుబాటులో లేకుండా పోయింది. ఆ గదిని స్టోర్ రూమ్ తరహాలో వినియోగిస్తూ వచ్చారు. పలు మార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించడం లేదని ఉద్యోగినులు వాపోతున్నారు. ప్రస్తుతం ఆ గదిని పరీక్షల మూల్యాంకన కోసం టీసీఎస్ కు అప్పగించేందుకు అధికారులు సిద్దపడటం దారుణమని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మహిళలనే కనీస మానవత్వం లేకుండా ఇలా తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
-పలు మార్లు అభ్యర్థించినా.…
మహిళల కోసం ఏర్పాటు చేసిన లేడీస్ కామన్ హాలు తొలగించవద్దని సుమారు 50మందికి పైగా మహిళా ఉద్యోగులు అధికారులకు రాతపూర్వకంగా విన్నవించారు. కానీ అధికారులు పట్టించుకోకుండా టీసీఎస్ విధుల కోసం అవసరమని వారి విన్నపాన్ని తోసిపుచ్చినట్లు సమాచారం. వర్సిటీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సౌకర్యం కంటే టీసీఎస్ కంపెనీపై ఆ అధికారికి ఎందుకంత ప్రేమ అంటూ ఉద్యోగులు విస్మమయం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామినేషన్ విధుల కోసం వర్సిటీలో పలు భవనాలు ఖాలీగా ఉన్నా లేడీస్ కామన్ హాల్ ను వారికి అప్పగించడంలో ఆంతర్యమేమిటో అర్ధం కాలేదని వాపోతున్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్