నల్లగొండ కిసాన్ సభను జయప్రదం చేయాలి*
*చౌటుప్పల్, మేజర్ న్యూస్:* నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించే అఖిల భారత కిసాన్ సభ బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పంతంగి గ్రామంలో సభ గోడపత్రికను విడుదల చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, ఎరువులను సకాలంలో అందించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, రైతు సంఘం నాయకురాలు చిరిక అలివేలు, రత్నం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.