BREAKING
మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి

సాగునీరు సాధనకై ఉద్యమించాలి

Select Suryaa Now
సాగునీరు సాధనకై  ఉద్యమించాలి

 

సంస్థాన్‌ నారాయణపురం మేజర్ న్యూస్ : రాచకొండ రిజర్వాయర్ సాధన కోసం రైతులు, ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, కె. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో చిలివేరు అంజయ్య అధ్యక్షతన జరిగిన సీపీఐ మండల కౌన్సిల్ సమావేశంలో వారు హాజరై మాట్లాడుతూ ఈ నెల 31న సంస్థాన్‌ నారాయణపురంలో రాచకొండ రిజర్వాయర్ సాధన కోసం నిర్వహించే ధర్నాకు రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు ఇవ్వాలని కోరారు. రిజర్వాయర్ నిర్మాణంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్‌ ద్వారా సంస్థాన్‌ నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాలకు సాగునీరు అందించే అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. రాచకొండ ప్రాంత సస్యశ్యామలం కోసం సీపీఐ ఆధ్వర్యంలో గతంలో రెండుసార్లు పాదయాత్రలు, నియోజకవర్గ స్థాయి సదస్సులు, సీనియర్‌ ఇంజినీర్లతో సమీక్షలు నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, పల్లె మల్లారెడ్డి, సుర్వి నరసింహ, దుబ్బాక సంజీవ తదితరులు పాల్గొన్నారు.