శాంతినగర్‌లో అమ్మవారి వడిబియ్యం అన్నప్రసాద వితరణ*
*చౌటుప్పల్, మేజర్ న్యూస్:* పురపాలిక పరిధిలోని శాంతినగర్‌లో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శాంతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్, శాంతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి వడిబియ్యం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, నగర అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దగోని రమేష్‌గౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యురాలు నబీబి జానీబాయ్, ప్రధాన కార్యదర్శి బొంగు పాండుగౌడ్, ఉపాధ్యక్షులు బత్తుల శంకర్, తమ్మకొండ రాజు, కోక్కు శ్రీనివాస్,దోనూరి లావణ్య, బుంగమాట్ల రవి,కోశాధికారి సురుగు రమేష్, మాజీ సర్పంచులు బొంగు లావణ్య జంగయ్యగౌడ్, ముద్దం సుమిత్ర సత్తయ్యగౌడ్,సుర్వి అంజయ్య, దాసోజు రామమూర్తి, బెదరకోట ఈశ్వరయ్య, బుడ్డ దశరథ, బుంగమట్ల భాస్కర్, తమ్మకొండ శ్రీను, సివిఆర్ శ్రీను, తమ్మ కొండ నవీన్, జాజుల శివ తదితరులు పాల్గొన్నారు.