BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

ముందస్తు చర్యలు – ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మాణమే లక్ష్యం... మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి

Select Suryaa Now
ముందస్తు చర్యలు – ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మాణమే లక్ష్యం... మున్సిపల్ కమిషనర్  రవీందర్ రెడ్డి

 


హాలియా మేజర్ న్యూస్.
ప్రకృతి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, భవిష్యత్తులో తలెత్తే నీటి ఎద్దడి సమస్యలను నివారించడమే లక్ష్యంగా హాలియా పురపాలక సంఘం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది, ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి సూచిస్తున్నారు, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకోవడం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు,
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత భూగర్భ జలాల పెంపునకు బాట
భవిష్యత్తులో నీటి సమస్యలు తీవ్రతరం కాకుండా ఉండాలంటే ప్రతి ఇంటి యజమాని బాధ్యతగా ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని పిలుపునిస్తున్నారు, వ్యక్తిగత ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం వల్ల వర్షపు నీటి సంరక్షణకు దోహదపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు లభిస్తుందని వివరిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు తమ పరిధిలోని కొత్త ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తూ, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టేలా ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించనున్నారు. ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తూ, నీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించేలా చర్యలు తీసుకుంటున్నారు.