భారీ వర్షాలతో ఏలేరు కాలువకు పెరిగిన వరద
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి: జెడ్పీటీసీ అభ్యర్థి అల్లు రామానాయుడు
మాకవరపాలెం, అక్టోబర్ 28,మేజర్ న్యూస్:
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. ఏలేరు కాలువలోనూ ప్రవాహం పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, జెడ్పీటీసీ అభ్యర్థి అల్లు రామానాయుడు తదితరులు కాలువను సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలువలు, చెరువుల సమీపానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దని కోరారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.