పెద్దేరు జలాశయం నుండి నీటిని విడుదల చేసినట్లు డి .ఈ .ఈ
మేజర్ న్యూస్ విమాడుగుల మండలంలో పెద్దేరు జలాశయం నుండి డి ఈ ఈ. బుధవారం తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ అర్ణబ్ తుఫాను కారణంగా జలాశయం నీటిమట్టం పెరుగుతుందని ముందుగా ఊహించి జలాశయానికి బుధవారం ఉదయానికి తన సిబ్బంది, సంబంధిత అధికారులతో, చేరు కున్నామని చెప్పారు. పెద్దేరు జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా జలాశయంలో మేము చూసేసరికి 136.6 మీటర్ల వరకు నీటి స్థాయి చేరుకుందని ఉదయం ఆరు గంటలకే స్పిల్ వే గేట్లను 2 తెరచి సెకండ్ కు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలియజేశారు. జలాశయం దిగువున గల మాడుగుల, బుచ్చయ్యపేట, చోడవరం, అనకాపల్లి, రాంబిల్లి, మండలాల రెవెన్యూ అధికారులకు, పోలీస్ అది కారులకు సమాచారాన్ని అందించి అప్రమత్తం చేశామన్నారు. అలాగే జలాశయం దిగువున గల ప్రజలు నదిలోకి ప్రవేశించరాదని, నదిని ఒక వైపు నుండి మరొకవైపు దాటరాదని హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. విడుదల చేస్తున్న నీటి పరిణామాన్ని క్రమంగా పెంచుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జే.ఈ పైడితల్లి, ఎం.పీ.డీ.వో కే .అప్పారావు, జాలంపల్లి పంచాయతీ కార్యదర్శి రవి శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.