BREAKING
వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం జల సంరక్షణపై విద్యార్థుల బృహత్తర కార్యక్రమం* బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. 30 కోట్ల దిశగా 'ఉడ్తా తీర్' వసూళ్లు! సమస్యలు లేని డివిజన్ గా మారుస్తా.. -63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి హామీ సాగునీరు సాధనకై ఉద్యమించాలి పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడుగా కేశవమూర్తి ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...మండల కార్యదర్శి, సైదులు సిపిఐఎం ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... 54వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి విషాదం.. ఆత్మహత్య చేసుకున్న పారా ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ యాదవ్! గిరిజన ప్రాంతాల్లోని 7 గ్రామాల్లో రక్తహీనత సర్వే పూర్తి చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.

వరద ఉధృతిపై ఎస్పీ తుహిన్ సిన్హా క్షేత్రస్థాయి పర్యటన!

Select Suryaa Now
వరద ఉధృతిపై ఎస్పీ తుహిన్ సిన్హా క్షేత్రస్థాయి పర్యటన!

 

కాజ్‌వేల వద్ద రాకపోకలు బంద్.

అదనపు బలగాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిద్ధం.

అనకాపల్లి, అక్టోబర్ 28, మేజర్ న్యూస్: తుఫాను ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి, బుచ్చయ్యపేట మండలాల్లోని పలు ముంపు, సమస్యాత్మక ప్రాంతాల్లో బుధవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. నీటి ప్రవాహం, వంతెనల పరిస్థితిని స్వయంగా పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి మండలంలో వెంకుపాలెం వద్ద గల శారదా నది ప్రవాహాన్ని పరిశీలించారు. పెద్దేరు రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయడంతో నదిలో ఉధృతి పెరిగిందని, దిగువ ప్రాంత ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం సుందరయ్యపేట నుండి వెంకుపాలెం వెళ్లే మార్గంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వెదుళ్ళగడ్డ కాజ్‌వే / బ్రిడ్జి ప్రాంతాన్ని సందర్శించి రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించారు. బుచ్చయ్యపేట మండలంలో  వడ్డాది బ్రిడ్జి, విజయరామరాజుపేట ప్రాంతాలను పరిశీలించారు. వడ్డాది వద్ద డౌన్ కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోగా, విజయరామరాజుపేట వద్ద టెంపరరీ కాజ్‌వే వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పరిస్థితిని సమీక్షించారు. వడ్డాది పైవంతెన పాతది కావడంతో ప్రమాదాల నివారణకు వైద్య, నిత్యావసర (రేషన్/మెడిసిన్) ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతించాలని, సాధారణ వాహనాలను నియంత్రించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా కీలక ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేసే ముందే లోతట్టు గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. దిగువ ప్రాంత పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓ లను వ్యక్తిగతంగా అప్రమత్తం చేయాలి. వరద ఉధృతి తగ్గేవరకు ప్రజలు, రైతులు వాగులు, వంకలు, నదులు దాటకూడదు. చేపల వేటకు వెళ్లరాదు. వంతెనలు, కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తున్నప్పుడు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలతో దాటే ప్రయత్నం చేయవద్దు. బుచ్చయ్యపేట తదితర ప్రాంతాలకు అదనపు పోలీసు బలగాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్పీతో పాటు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు, ఎస్.బి సిఐ బాల సూర్యరావు, అనకాపల్లి రూరల్ సిఐ అశోక్ కుమార్, బుచ్చయ్యపేట సిఐ కోటేశ్వరరావు, ఎస్సైలు మనోజ్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.