రంగయ్య చెరువు కాలువ పనులు పూర్తి చేయాలి-నేడు బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
నల్లబెల్లి, మేజర్ న్యూస్, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల రైతులకు సాగునీరు అందించే రామప్ప - రంగయ్య చెరువు ప్రాజెక్టు కుడి కాలువ నిర్మాణ (రోడ్డు కటింగ్) పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బానోతు సారంగపాణి తెలిపారు.
గురువారం ఉదయం 8:30 గంటలకు ఎన్ హెచ్ 365, రుద్రగుడెం (పెద్ద తండా) వద్ద ఈ ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ కాలువ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రిపోర్టర్; శంకరయ్య, నల్లబెల్లి ,వరంగల్ జిల్లా