పెన్షన్ పంపిణీలో అధికార పార్టీ జోక్యం నివారించాలి
రావికమతం అక్టోబర్ 28 మేజర్ న్యూస్ : ఈనెల 30న నిర్వహించనున్న పెన్షన్ పంపిణి లో రాజకీయ నాయకుల జోక్యం నివారించాలని చినపాచిల విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేస్తున్న కోదండరాం బుధవారం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మహేష్ కు ఫిర్యాదు చేశారు.. దాని పోటీ చేస్తున్న సెగ్మెంట్లో టిడిపి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త ఉపాదాభి పథకం ఉద్యోగి అయినందున గత కొంతకాలంగా గ్రామంలో పెన్షన్ పంపిణీ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెన్షన్ పంపిణీ నెపంతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున రాజకీయ పార్టీల జోక్యం నివారించాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తామని మహేష్ తెలిపారు.