BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

*జోరు గాలి వానలోనూ ఇంటింటా ప్రచారం చేసిన టిడిపి పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి కంకణపల్లి అనురాధ.

Select Suryaa Now
*జోరు గాలి వానలోనూ ఇంటింటా ప్రచారం చేసిన టిడిపి పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి కంకణపల్లి అనురాధ.

 

సీతానగరం అక్టోబర్ 28 మేజర్ న్యూస్...  మండలం సీతానగరం. ఇప్పలవలస,పాపంవలస, పెదఅంకలం.  బుర్జ. చినఅంకలం. కోట సీతారాంపురం గ్రామల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం హోరెత్తింది. అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న జోరు గాలి వానను సైతం లెక్కచేయకుండా టిడిపి పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి కంకణపల్లి అనురాధ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలు తనను  అలాగే ఎంపిటిసి అభ్యర్థులను  భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. వర్షంలో తడుస్తూనే ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని  . ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి అంశాలను తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేస్తానని ఆమె తెలియజేశారు . ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.