అనురాగ్ రోవర్ ఫీల్డ్ టెస్టింగ్ సక్సెస్
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:అనురాగ్ యూనివర్సిటీ రూపొందించిన రోవర్ విండ్ టర్బైన్ బ్లేడ్లపై విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసింది. అక్టోబరు 3న ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు ఎనర్జీస్ విండ్ ఫామ్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. యూనివర్సిటీ ఏఐఎంఎల్ విభాగాధిపతి డా. ఎ. మల్లికార్జున రెడ్డి, డా. కె. ఆనంద్, లూమూస్ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐఎంఎల్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు, 3డీ ప్రింటింగ్, అనురాగ్‌శాట్ బృందాలు సంయుక్తంగా రోవర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక సాంకేతిక పరిజ్ఞానంపై అనుభవం లభించిందని డా. మల్లికార్జున రెడ్డి తెలిపారు. సహకరించిన అధ్యాపకులు, విద్యార్థులు, యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.