గణేష్ కు శాప్ చైర్మన్ అభినందన
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : జపాన్ లో ఇటీవల జరిగిన 20వ ఏషియన్ గేమ్స్ లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన తెలుగు తేజం, అంతర్జాతీయ ఆర్చర్ గణేష్ మణిరత్నంను శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందించారు. ఈ మేరకు గణేష్ మణిరత్నం బుధవారం శాప్ చైర్మన్ రవి నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. గణేష్ విజయాలు రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఘనంగా ఘనంగా సత్కరించి అభినందించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్