అవధానం ఏకాగ్రతను పెంపొందిస్తుంది
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : అవధానం యజ్ఞం లాంటిదని, ఏకాగ్రతను పెంపొందిస్తుందని పద్మావతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భీమన్న పేర్కొన్నారు. ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో గత రెండు రోజులగా జరుగుతున్న అవధాన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విద్యార్థులు అవధానం భాషా వ్యాకరణాలపట్ల పట్టును తెలియజేస్తుందని తెలిపారు. విద్యార్థి దశ కీలకమని ఉన్నత లక్ష్యాలవైపు అడుగులు పడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీతారామరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సంస్కారం అలవరుచుకోవాలని సూచించారు. అనంతరం శతావధాని ఆముదాల మురళి మాట్లాడుతూ ప్రాచ్య కళాశాల ఎందరో అవధానులను, కవులను, కళాకారులను తీర్చిదిందని కొనియాడారు. విద్యార్థులు జ్ఞాన సముపార్జన వైపు దృష్టిసారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ మాదుగుల అనిల్ కుమార్, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ రవీంద్ర, డాక్టర్ పురందీశ్వరి, భాస్కరశర్మ, సంజీవరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్