కడుబండి అహంకారం కి కొప్పల వెలమ బలి వైసీపీ పార్టీ కి జగనన్నకి నష్టం కలిగితే ఊరుకోము అన్న మాజీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు
లక్క వరపు కోట, అక్టోబర్ 28 మేజర్ న్యూస్ :* లక్కవరపుకోట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల కేటాయింపులో కొప్పల వెలమ సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరిగిందని మాజీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో సుమారు 40 వేల మంది జనాభా ఉండగా, కొప్పల వెలమ సామాజిక వర్గం జనాభా పరంగా ఆధిక్యంలో ఉందని ఆయన పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగాల్సి ఉండగా, అనాదిగా వస్తున్న ఆనవాయితీకి విరుద్ధంగా కడుబండి వ్యవహరించారని విమర్శించారు.నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు వ్యవహారశైలి వల్ల తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని గేదెల శ్రీనివాసరావు ఆరోపించారు. జడ్పీటీసీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన తూర్పాటి వరలక్ష్మికి అవకాశం కల్పించడంతో పాటు, మండల పార్టీ అధ్యక్ష పదవిని కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారని తెలిపారు ఇప్పుడు ఎంపీపీ స్థానం నీ తెలగ సామజిక వర్గం కి కేటాయించారు అని . ఎంపీటీసీ స్థానాల కేటాయింపులోనూ ఇతర సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, కొప్పల వెలమ సామాజిక వర్గానికి తక్కువ స్థానాలు కేటాయించారని పేర్కొన్నారు.కడుబండి శ్రీనివాసరావును ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సీట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తమను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఏది జరిగినా తన ఇష్టానుసారంగానే జరగాలన్న ధోరణి పార్టీకి నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.ఇదే విధమైన వ్యవహారశైలి కొనసాగితే రానున్న కాలంలో ఎస్.కోట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లక్కవరపుకోట మండలంలో పార్టీ పరిస్థితులు, నాయకుల వ్యవహారశైలిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని తెలిపారు.
*పార్టీని వీడే ప్రసక్తే లేదు*
ఎన్ని పరిణామాలు ఎదురైనా తాను పార్టీని వీడబోనని గేదెల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో, బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి, విజయానికి నిరంతరం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కొప్పల వెలమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లడమే తన ఉద్దేశమని, ఇతర సామాజిక వర్గాలను విమర్శించే ఉద్దేశం తనకు లేదని ఆయన వివరించారు.వైసీపీ పార్టీ కి జాననన్నకి నష్టం కలిగేలా వ్యవహారిస్తే ఊరుకునేది లేదని మాజీ ఎంపీపీ హెచ్చరించారు