ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే "కోండ్రు"
... వైసీపీ నుండి తెదేపాలో చేరిన 30 కుటుంబాలు
రాజాం,అక్టోబర్ 28,మేజర్ న్యూస్ :
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ఆకర్షితులై వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి,రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.స్థానిక ఎన్నికల్లో భాగంగా రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.వీరిని సాదరంగా ఆహ్వానించి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో ఎనిమిది ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయన్నారు.స్థానిక ఎన్నికల్లో నూటికి నూరుశాతం కూటమి అభ్యర్ధులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.నేడు మాటల్లోనే కాదు చేతల్లో 'చెప్పాం.. చేస్తున్నాం..' అని అన్నారు. రాజాం నియోజక వర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం జలజీవన్ మిషన్ అమరజీవి జలధార పథకం కింద రూ.100 కోట్లతో శాశ్వత పరిష్కారం చూపించామన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే ఎన్నికల హామీలను అమలు చేసి నేడు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నామన్నారు.ప్రతి గ్రామంలోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని,అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రజలకు చేసిన అభివృద్ధి,అందించిన సంక్షేమాన్ని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి వేసే ప్రతి ఓటు గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మార్గం వేస్తుందని పేర్కొన్నారు.రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి,సంక్షేమ రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో నియోజకవర్గానికి సుమారు రూ.1,000 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమం చేస్తున్నామని అన్నారు.గ్రామాల్లో సీసీ రోడ్లు,బీటీ రోడ్లు,డ్రైనేజీలు,తాగునీటి పథకాలుపుంత రహదారులు,విద్యుత్ సదుపాయాల కల్పన,తదితర పనులు చేపట్టినట్లు వివరించారు.పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ రహదారులను మెరుగుపరిచామన్నారు. ప్రతి గ్రామంలో చేపట్టిన పనులను గుర్తించి, వాటివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించారు.ఈ కార్యక్రమంలో గురవాన నారాయణ రావు,దుప్పల పూడి శ్రీను,జడ్డు విష్ణు, చందక రాము,జెడ్పీటీసీ అభ్యర్థి చీడి రూపవతి, ఎంపీటీసీ అభ్యర్థి ఆబోతుల భానుమతి తదితర కూటమి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.