మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
* 73 మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కును సద్వినియోగం:
బొబ్బిలి, అక్టోబర్ 28: మేజర్ న్యూస్:2వ పురపాలక సంఘ సాధారణ ఎన్నికలలో భాగంగా గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్, విజయనగరం వారి సూచనల మేరకు బుధవారం పురపాలక సంఘ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకున్నారు.ఈ మేరకు నవంబర్ 1వ తేదీన ఎన్నికల విధులలో నియామకం కాబడ్డ సిబ్బందికి ఓటు హక్కు వినియోగించుకొనుటకు గాను పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఏర్పాటు చేయడమైనది.
ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా 73 మంది సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని తెలియజేయడమైనదని సహయ ఎన్నికల అధికారి ఎల్. రామలక్ష్మి తెలిపారు.