ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో 40 కుటుంబాలు చేరిక
గిద్దలూరు, మేజర్ న్యూస్ : పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కొమరోలు మండలం బాదినేనిపల్లె గ్రామానికి చెందిన బద్రి లక్ష్మి రంగారెడ్డి, ముత్తుముల ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో వెర్రి బాల మద్దిలేటి, లొక్కు దేవన్నతో పాటు 40 కుటుంబాలు వారి అనుచరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.*
*ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థులకు మద్దతు గా నిలిచి వారి గెలుపు దిశగా ముందుకు సాగాలని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారిని, శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి గారిని నూతనంగా పార్టీలో చేరిన వారు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గోడి ఓబుల్ రెడ్డి, బిజ్జల తిరుమల రెడ్డి,కొమరోలు మండల ప్రముఖులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.