అలియాబాద్ 18, 19వ వార్డుల్లో లో వోల్టేజ్ సమస్యకు చెక్.. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు భూమిపూజ
శామీర్‌పేట, మేజర్ న్యూస్: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18, 19వ వార్డుల్లో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం చూపేందుకు నూతనంగా 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కల్పించాలనే లక్ష్యంతో విద్యుత్ అధికారులతో చర్చించి ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయించినట్లు తెలిపారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో ఆయా వార్డుల్లో లో వోల్టేజ్ సమస్య తగ్గి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డుల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు కుమార్ యాదవ్, వెంకటేశ్ యాదవ్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.