BREAKING
ప్రతి గడపలో టిడిపి నినాదం -తిరుపతిలో కూటమి జెండా ఎగరాల్సిందే -నగర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది అన్నా మల్లీశ్వరి గెలుపు కోసం తుడా చైర్మన్ గడపగడపకు ప్రచారం నల్లగొండ కిసాన్‌ సభను జయప్రదం చేయాలి* ప్రపంచ కుస్తీ ఛాంపియన్‌షిప్‌లో తీవ్ర నిరాశ.. పతకం లేకుండానే వెనుదిరిగిన భారత రెజ్లర్లు! మూసి నీటిని క్రమబద్ధీకరించాలి.* ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు అరుదైన రికార్డు.. బంగ్లాదేశ్‌పై గోల్స్ వర్షం! అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాను -59వ డివిజన్ లో జగదీష్ ప్రచారం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొండూరి నవీన్‌ బస్సు ప్రమాదంలో మృతి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాక్సింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా బాక్సర్లు! తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ రగ్బీ చరిత్రలో అద్భుతం.. బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు! ఐఐటిఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమం రోజువారీ ఆహారంలో బీట్‌రూట్, పెరుగు చేర్చుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పర్యటన

రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్

Select Suryaa Now
రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్

బయ్యారం, మేజర్ న్యూస్, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బయ్యారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు. బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ అందజేసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కంబాల ముసలయ్య, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి పెద్దినేని వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మాజీ సర్పంచ్ చింత రమణమ్మ, తగిర సత్తిరెడ్డి, నందగిరి భద్రయ్య, వైద్యుడు డాక్టర్ విజయ్ కుమార్, ఫార్మసిస్ట్ రామ నర్సయ్య, స్టాఫ్ నర్స్ లత, పెద్ద బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్; స్వామి బయ్యారం మహబూబాద్ జిల్లా