అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాను -59వ డివిజన్ లో జగదీష్ ప్రచారం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న తనకు అవకాశం కల్పిస్తే డివిజన్ ను మరింత అభివృద్ధి చేస్తానని ఆ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆ డివిజన్లోని పలు ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచుతూ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. డివిజన్లో త్రాగునీరు డ్రైనేజీ వీధి దీపాలు సమస్యలను నెలలోపు పరిష్కరించి మీ అందరి ఆశీస్సులు పొందుతానని, అందుకు రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, వాటర్ ప్లాంట్ రవిచంద్రారెడ్డి, గుణ, కే నరేంద్ర, ఆల్వార్ మురళి, దివాకర్, కుప్పయ్య, నిత్య, కవిత, చిన్నక్క, కళ్యాణ్, ఢిల్లీ, సందీప్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్