BREAKING
ప్రపంచ కుస్తీ ఛాంపియన్‌షిప్‌లో తీవ్ర నిరాశ.. పతకం లేకుండానే వెనుదిరిగిన భారత రెజ్లర్లు! మూసి నీటిని క్రమబద్ధీకరించాలి.* ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు అరుదైన రికార్డు.. బంగ్లాదేశ్‌పై గోల్స్ వర్షం! అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాను -59వ డివిజన్ లో జగదీష్ ప్రచారం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొండూరి నవీన్‌ బస్సు ప్రమాదంలో మృతి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాక్సింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా బాక్సర్లు! తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ రగ్బీ చరిత్రలో అద్భుతం.. బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు! ఐఐటిఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమం రోజువారీ ఆహారంలో బీట్‌రూట్, పెరుగు చేర్చుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పర్యటన ట్రెండ్స్ పాఠశాలలో నెట్ బాల్ కోర్టు ప్రారంభం పాండ చెరువు కట్టపై సీసీ రోడ్డు పనులు ప్రారంభం మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా

నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు

Select Suryaa Now
నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం గౌతమీ నదీతీరంలోని కోనసీమ తిరుమలగా ఖ్యాతి కెక్కిన వాడపల్లి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.  ఆలయంలో ఈ నెల 29 నుంచి నవంబరు 6వ తేదీ వరకు  బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా... ఆలయాన్ని అత్యద్భుతంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సులభంగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ (డీసీ) నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, వివిధ అలంకరణల్లో స్వామివారి వాహన సేవలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో కొన్ని నిత్య కార్యక్రమాలను, సేవలను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

★ 9 రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు

 29న  అంకురార్పణ, ద్విజాహ్వానం, పరవాసుదేవ అలంకరణతో శేషవాహన సేవ నిర్వహించనున్నారు.

30 న : మహాపుష్పయాగం, గోదావరి నదీజలాల సంగ్రహణ, లక్ష కుంకుమార్చన, సరస్వతి అలంకరణతో హంసవాహన సేవ నిర్వహిస్తారు. 31న : మహాపుష్పయాగం, సహస్ర దీపాలంకరణ సేవ, కోదండరామ అలంకరణతో హనుమద్వాహన సేవ, ఉదయం శ్రీనివాస కల్యాణం, రాత్రి యోగనరసింహ అలంకరణతో సేవలు నిర్వహించనున్నారు.

నవంబరు 1 న :

 సింహ అలంకరణతో సింహవాహన సేవ నిర్వహిస్తారు.2న :

 ఉదయం మహాసుదర్శన హోమం, తోమాల సేవ, రాత్రి మలయప్ప స్వామి అలంకరణతో గరుడవాహన సేవ నిర్వహించనున్నారు. 3 న : 

ఉదయం అష్టదళ పాదపద్మారాధన, శ్రీకృష్ణ అలంకరణతో సూర్యప్రభ వాహన సేవ, రాత్రి మోహినీ అలంకరణలో చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు. 4 న : 

 అష్టోత్తర శతకలశాభిషేకం, లక్ష తులసి పూజ, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర మూలమంత్ర పూర్వక వేంకటేశ్వర హోమం నిర్వహిస్తారు. రాజాధిరాజ అలంకరణలో స్వామివారి సేవ, ఉభయ దేవేరులతో కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం చూర్ణోత్సవం, రాత్రి కల్కి అలంకరణలో అశ్వవాహన సేవ నిర్వహించనున్నారు.

 5న : 

గజవాహన సేవ, తిరుప్పావడ సేవలు నిర్వహిస్తారు. 6 న :

 మహాపూర్ణాహుతి, గౌతమీ నదీతీరంలో అవభృథస్నానం (చక్రస్నానం), ధ్వజావరోహణం, మహదాశీర్వచనం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి వాహన సేవలను తిలకించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.