BREAKING
నల్లగొండ కిసాన్‌ సభను జయప్రదం చేయాలి* ప్రపంచ కుస్తీ ఛాంపియన్‌షిప్‌లో తీవ్ర నిరాశ.. పతకం లేకుండానే వెనుదిరిగిన భారత రెజ్లర్లు! మూసి నీటిని క్రమబద్ధీకరించాలి.* ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు అరుదైన రికార్డు.. బంగ్లాదేశ్‌పై గోల్స్ వర్షం! అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాను -59వ డివిజన్ లో జగదీష్ ప్రచారం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొండూరి నవీన్‌ బస్సు ప్రమాదంలో మృతి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాక్సింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా బాక్సర్లు! తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ రగ్బీ చరిత్రలో అద్భుతం.. బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు! ఐఐటిఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమం రోజువారీ ఆహారంలో బీట్‌రూట్, పెరుగు చేర్చుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పర్యటన ట్రెండ్స్ పాఠశాలలో నెట్ బాల్ కోర్టు ప్రారంభం

కరువు నివారణ చర్యలపై అధికారుల దృష్టి

Select Suryaa Now
కరువు నివారణ చర్యలపై అధికారుల దృష్టి

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండలాన్ని కరువు ప్రభావిత మండలంగా గుర్తించిన నేపథ్యంలో కరువు నివారణ చర్యలపై అధికారులు దృష్టి సారించారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కరువు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. వి.బి.జి. రాంజీ పథకం ద్వారా ఉపాధి పనులు చేపట్టాలని, నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని సూచించారు. విద్యుత్ పొదుపు చర్యలు పాటిస్తూ కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.

రిపోర్టర్; రామకృష్ణ, భీమదేవరపల్లి హనుమకొండ జిల్లా