BREAKING
తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ రగ్బీ చరిత్రలో అద్భుతం.. బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు! ఐఐటిఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమం రోజువారీ ఆహారంలో బీట్‌రూట్, పెరుగు చేర్చుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పర్యటన ట్రెండ్స్ పాఠశాలలో నెట్ బాల్ కోర్టు ప్రారంభం పాండ చెరువు కట్టపై సీసీ రోడ్డు పనులు ప్రారంభం మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో అప్రమత్తమైన పునరావాస కేంద్రాల ను పరిశీలించిన ఉన్నత అధికారులు రక్తదానం ప్రాణదానం తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం విజయవంతం ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గణేష్ కు శాప్ చైర్మన్ అభినందన . ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. పక్కి గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రచారం

పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్

Select Suryaa Now
పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్

మరిపెడ, మేజర్ న్యూస్, విధి నిర్వహణలో తమ ప్రాణాలనర్పించిన పోలీసు అమర వీరుల త్యాగం వృధా కాదని మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. మరిపెడ పట్టణ కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కార్గిల్ సెంటర్ నుండి రాజీవ్ సెంటర్ వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించి, అమర వీరులకు నివాళులర్పించారు.ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ దేశ రక్షణలో, ప్రజా శాంతి భద్రతలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు వీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.విధి నిర్వహణలో వారి త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. వారి స్మరణతో నిరంతరం ప్రజలకు అండగా ఉంటామని, ప్రజలు సహకరించాలని కోరారు.అనంతరం రాజీవ్ సర్కిల్ లోని అమర జవాన్ ఉదయ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు గాండ్రతి సతీష్, మహబూబీ, కుశ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్; చందర్ ,మరిపెడ, మహబూబాద్ జిల్లా