BREAKING
ప్రతి గ్రాడ్యుయేట్ ఓటుతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంగవైకల్యాన్ని అధిగమించి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డికి ఘన సన్మానం.. రూ.50 వేల నగదు ప్రోత్సాహకం ఓటీటీలో భయపెడుతున్న కొత్త హారర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా వీక్షించండి! రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ కరువు నివారణ చర్యలపై అధికారుల దృష్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్‌ దుస్తుల పంపిణీ అభినందనీయం: పీఏసీఎస్‌ చైర్మన్‌ మన్నె శంకర్‌ యాదవ్‌ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కొత్త సినిమా.. ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ! ఈనెల 30 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్ డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కు భారీ ధర, ఎవరెవరు ఏ జట్టుకంటే? పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు అలియాబాద్‌ 18, 19వ వార్డుల్లో లో వోల్టేజ్‌ సమస్యకు చెక్‌.. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు భూమిపూజ హాలీవుడ్ సంచలనం.. మళ్లీ క్యాట్నిస్‌గా జెన్నిఫర్ లారెన్స్ రీఎంట్రీ నల్లబెల్లి ని కరువు మండలం గా ప్రకటించాలి

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి

Select Suryaa Now
ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి

సూర్య ప్రతినిధి, ఒంగోలు : ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను మరింత ముమ్మరం చేసి, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె ఎన్‌జీ పాడు, అద్దంకి తదితర ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్‌జీ పాడు గ్రామంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును పరిశీలించి, ఎఫ్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఎన్‌జీ పాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎఫ్‌ఎస్‌టీ, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, ఎంసీసీ బృందాలతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. తనిఖీల సందర్భంగా కేసులు నమోదైతే సంబంధిత నివేదికలను పరిశీలకులకు అందజేయాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. వాహనాల తనిఖీల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని, అనుమానాస్పద వస్తువులు, నగదు లేదా ఇతర సామగ్రిని సరైన అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో పాటు నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.