ప్రతి గ్రాడ్యుయేట్ ఓటుతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి , మేజర్ న్యూస్, ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలి పారు. బుధవారం మండల కేంద్రం లోని శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వ హించిన గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు, సన్నా హక సమా వేశంలో ఎర్ర బెల్లి దయాకర్ రావు పా ల్గొని మాట్లాడుతూ అర్హులైన ప్రతి గ్రాడ్యు యేట్ ఓటు నమోదు చేసు కోవాలి. ఓటు హక్కుప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఆయుధం. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియో గించుకునేలా ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త గ్రాడియట్స్ కు అవ గాహన కల్పించాల న్నారు.ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని రైతులు, మహిళలు, నిరుద్యోగు లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ప్రజలకు తెలుపాలని కోరారు.నిరుద్యోగులకు ఉద్యో గాలు,యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు, ప్రజలకు సంక్షేమం అందించ డంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో ప్రజలకు తెలిపాలని అన్నారు. ప్రభుత్వ పనితీరును అంచన వేసి, ప్రజాసమస్యలపై తమ అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తం చేసే అవకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుతో సమాధానం చెప్పాలని తెలిపారు.పట్టభద్రులందరూ ఓటరు నమోదు పై నిర్లక్ష్యంచేయకుండ అర్హులైన ప్రతి ఒక్కరు నిర్ణీత గడువులో తమ పేరును నమోదు చేసుకోవాలి. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించి నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాల న్నారు.పట్టభద్రుల సమస్యలను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలంగా వినిపించేలా ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్, నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ ,సోమయ్య, పాలకుర్తి మహబూబాద్ జిల్లా