31వ వార్డు అభ్యర్థిని గెలిపించండి... మాండ్ర
31వ వార్డు అభ్యర్థిని గెలిపించండి... మాండ్ర
- అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: పట్టణ ప్రజలు మున్సిపల్ చైర్మన్, వార్డు అభ్యర్థులకు ఒకసారి అవకాశం ఇస్తే పట్టణ అభివృద్ధి చేసి చూపిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి నందికొట్కూరు పట్టణంలోని అల్లూరు రోడ్డులోని బి. బి. ఆర్ నగర్ 31వ వార్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేయాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా కూటమి బలపరిచిన నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థి మొల్ల సబేరున్నిసా కి టీడీపీ 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చంద్రమోహన్ రెడ్డి కి టీడీపీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రజాసేవకు, అభివృద్ధికి మద్దతుగా నిలవాలని మాండ్ర శివానందరెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.