ఎంపీటీసీ అభ్యర్థి సాసుబల్లి మౌనికను గెలిపించండి
పాచిపెంట, అక్టోబర్ 28, మేజర్ న్యూస్:
మండల కేంద్రమైన పాచిపెంట గ్రామంలో 3వ సెగ్మెంట్లో వైసీపీ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా సాసుబిల్లి మౌనిక ను వైయస్సార్ పార్టీ అధిష్టానం మరియు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, వైసిపి పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీపీ అభ్యర్థి అయినటువంటి డోల బాబ్జి ల ఆశీస్సులతో ఆమెను స్థానిక ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. బుధవారం సాయంత్రం 3వ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి సాలాపు వీధి, మ** వీధి లలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సాసుబిల్లి మౌనిక విలేకరులతో మాట్లాడుతూ తనను ఎంపీటీసీగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వైసిపి పార్టీ సీనియర్ నాయకులు , ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి ను కూడా అత్యధిక ఓట్ల మెజారితో గెలిపించి పాచిపెంట మండల అభివృద్ధిని చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు.