BREAKING
తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ రగ్బీ చరిత్రలో అద్భుతం.. బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు! ఐఐటిఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమం రోజువారీ ఆహారంలో బీట్‌రూట్, పెరుగు చేర్చుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పర్యటన ట్రెండ్స్ పాఠశాలలో నెట్ బాల్ కోర్టు ప్రారంభం పాండ చెరువు కట్టపై సీసీ రోడ్డు పనులు ప్రారంభం మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో అప్రమత్తమైన పునరావాస కేంద్రాల ను పరిశీలించిన ఉన్నత అధికారులు రక్తదానం ప్రాణదానం తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం విజయవంతం ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గణేష్ కు శాప్ చైర్మన్ అభినందన . ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. పక్కి గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రచారం

నల్లబెల్లి ని కరువు మండలం గా ప్రకటించాలి

Select Suryaa Now
నల్లబెల్లి ని కరువు మండలం గా ప్రకటించాలి

నల్లబెల్లి, మేజర్ న్యూస్, నల్లబెల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటింప చేయడంలో ఎమ్మెల్యేతో పాటు అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి అన్నారు. బుధవారం నల్లబెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో పరికి కోర్నేలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో, రైతుల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నల్లబెల్లిలో సాధారణ వర్షపాతం 1037.2 మి.మీ కాగా, ఈ ఏడాది కేవలం 511.3 మి.మీ మాత్రమే నమోదై మైనస్ 51 శాతం వర్షాభావం ఉందని, అయినా కరువు జాబితాలో చేర్చకపోవడం దారుణమన్నారు.* మైనస్ 38 శాతం వర్షపాతం ఉన్న మండలాలను కరువు జాబితాలో చేర్చినప్పుడు, మైనస్ 51 శాతం ఉన్న నల్లబెల్లిని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.స్థానిక ఎమ్మెల్యే ముందస్తుగా అధికార యంత్రాంగానికి సూచనలు చేసి, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ నివేదికను ప్రభుత్వానికి అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 24న జీవో ఎంఎస్ నెం. 3-2026 ద్వారా హడావుడిగా జాబితా విడుదల చేసి, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టడంలో అర్థం లేదన్నారు.అక్టోబర్ 31న కేంద్రానికి పంపే జాబితాలోనైనా నల్లబెల్లితో సహా జిల్లాలో మిగిలిన మండలాలను సమగ్రంగా అధ్యయనం చేసి చేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులు కేంద్ర, రాష్ట్ర సహాయాలు కోల్పోవడంతో పాటు, రుణాల వసూళ్లలో బ్యాంకుల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి చీకటి ప్రకాష్, రైతు సంఘం మండల కార్యదర్శి మామిండ్ల పెద్ద ఐలయ్య, రైతులు బూస కుమారస్వామి, వైనాల వీరాస్వామి, మాజీ ఎంపీటీసీ పాండవుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;శంకరయ్య, నల్లబెల్లి ,వరంగల్ జిల్లా