telangana
నీళ్లు..కరెంటు లేక రైతులు ఆగం - ఎండిన పొలంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
సూర్య,మంథని రూరల్,:ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించిన ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా డిక్లర్ చేయకపోవడానికి కారణం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధరే కారణమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పేర్కొన్నారు.బుధవారం సాయంత్రం మంథని మండలం మైదుపల్లి శివారులో ఓ రైతు ఎండిన వరి పొలాన్ని పుట్ట మధు పరిశీలించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాను ఎందుకు కరువు జిల్లాగా ప్రకటించలేదో జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కరెంటు రాక నీళ్లు లేక పంటలు సరిగ్గా పండకు రైతులు ఆగం అవుతుంటే మరోవైపు దుద్దిళ్ల శ్రీధర్ రైతుల గురించి నీచంగా మాట్లాడుతున్నాడని అన్నారు.ఇటీవల ముత్తారం మండలానికి చెందిన ఓ రైతు ఎండిన పొలాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చే యగా మరికొంత మంది రైతులు కరెంటు రావడం లేదని కరెంటు తీగలపై బట్టలు ఆరవేసి నిరసన తెలిపారని ఆయన గుర్తు చేశారు.మంగళవారం లద్నాపూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దుద్దిళ్ల శ్రీధర్ మాట్లాడుతూ పదేండ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అనడం విడ్డూరంగా ఉందన్నారు.పదేండ్లలో ఒక్క గుంట భూమి ఎండిపోయినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.ఆనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిరంతర కరెంటు,నీళ్లు ఇచ్చి ఒక్క గుంట ఎండిపోకుండా వ్యవసాయ రంగానకి పెద్ద పీట వేసి ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే నని అన్నారు.ఈనాడు అధికారులను బెదిరించి తప్పుడు లెక్కలు రాయించి కరువు మండలాలు ఉండవద్దని రిపోర్ట్ ఇప్పించినట్లు బావిస్తున్నానని అన్నారు.కరువు ప్రాంతంగా ప్రకటిస్తే పొద్దున్నే లేచి పొలాల వెంట,గ్రామాల్లో తిరుగాల్సి వస్తుందని,ఆలోచన చేశారని అన్నారు.కరువు జిల్లాగా ప్రకటిస్తే రైతులకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందని,రైతులకు పరిహారం రాకుండా చేసింది మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము రైతుల కష్టాలు తెలిసి వారి పక్షాన పోరాటం చేస్తున్నామని అన్నారు.ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడి ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు ప్రజల మద్యలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన హితవు పలికారు.ఎల్‌నినో వచ్చినా కాపాడే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయడం లేదని,ఈ విషయంపై ప్రశ్నిస్తే తిడుతున్నారని బదనాం చేస్తున్నారని అన్నారు.ఈనాడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని, నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయి రైతులు ఆగం అవుతున్నారని,ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ఎందుకు ప్రకటించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రతి గ్రామంలో పది ఎకరాలు సాగు చేసిన పొలంలో రెండు ఎకరాలు ఎండిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కరువు జిల్లాగా ప్రకటిస్తే రెండు ఎకరాలు, మూడు ఎకరాలు ఎండిపోయిన నష్టపోయిన రైతులు ఎంతో కొంత పరిహారం అందేదన్నారు.కక్ష్యకట్టి అధికారులతో రిపోర్ట్ ఇప్పించి పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకుండా చేశాడని, ఈ విషయాన్ని జిల్లాలోని రైతాంగం,ప్రజలు గమనించాలన్నారు.ఇప్పటికైనా రైతులకు క్షమాపణలు చెప్పి కరువు జిల్లా గా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.