కొటియా మనది, మనమే రక్షించుకుందాం
ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల పిలుపు
మేజర్ న్యూస్ సాలూరు అక్టోబర్ 28
వివాదస్పద 21కొటియా గ్రూపు గ్రామాలు మనవే అని, వాటిని రక్షించు కోవల్సిన బాధ్యత మనందరి పై ఉందని ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భక్తి చరణ్ దాస్ ఆధ్వర్యంలో కొరాపుట్ ఎంపి సప్తగిరి శంకర్ ఉల్కా, పొట్టంగి, జైపూర్ ఎంఎల్ఎలు రామచంద్ర కదం, తారాప్రసాద్ భాగర్ పతి, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు రూపక్ తురుక్ తదితరులతో కలిసి సేవ్ కొటియా అన్న నినాదంతో కొఠియా వివాదస్పద గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ, అంతా ఒడిశా వైపే ఉండాలని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కొన్ని రోజుల్లో నిర్వహించే స్థానిక ఎన్నికల్లో పాల్గొనరాదని కోరారు. ఒడిశా అన్ని విధాలుగా మీ అభివృద్ధికి తోడ్పడుతుందని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసారు. ముఖ్యంగా కోటియా గ్రామాలు ఒడిశాలో అంతర్భాగమన్నారు. వీటిని వదులుకునేందుకు సిద్ధంగా లేమన్నారు. అలాగే ఒడిశా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. ఈ ఎన్నికలను ఏపీ ప్రభుత్వం రిఫరెండంగా చూపించే అవకాశం ఉందన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చెయ్య రాదన్నారు. అదేవిదంగా ఒడిశాలో బీజేపీ, ఏపీలో ఎన్డీయే అధికారంలోకి ఉన్నాయని కావున ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడి కొటియాలో ఎన్నికలు జరగకుండా చూసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. అలాగే కొటియా భూభాగాన్ని కాపాడుకొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందా:-
నవంబర్ 3న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో 21 వివాద స్పద గ్రామాల్లో ఉన్న కొఠియా గ్రామాల ప్రజలు 2011 ఎన్నికల గణాంకాల ప్రకారం 4349 మంది జనాభా ఉండగా వారిలో 20083 మంది ఓటర్లు ఉన్నారని వారందరికీ ఎన్నికలలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. గత రెండు రోజుల క్రితం కొఠియా బిజెడి పార్టీ ఎమ్మెల్యే రభీనంద తో పాటు తదితర నాయకులు, కార్యకర్తలు పోలీసులతో సహా కొఠియా వివాదాస్పద గ్రామాలలో పర్యటించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ ఒక్కరూ పాల్గొనకూడదని అక్కడున్న ఓటర్ల పై హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. అలాగే వివాదాస్పద గ్రామాల్లో ఉన్న ఊర్ల పేర్లతో ఉన్న పట్టు చెన్నూరు తదితర తెలుగు బోర్డులను రాళ్లతో కొట్టి చందరవందర చేశారు. ఆ మేరకు. సాలూరు రూరల్ పోలీసులతో సహా ఎంఆర్ఓ సురేష్ కుమార్, ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి బృందంతో వెళ్లి ఆయా గ్రామ ప్రజలకు ఓట్లు వెయ్యాలని అవగాహన కల్పించడంతో పాటుగా ఒడిస్సా నాయకులు కార్యకర్తలు విరగ్గొట్టిన తెలుగు బోర్డులను తిరిగి అమర్చారు. ఏది ఏమైనప్పటికీ ఒడిస్సా నాయకులు పోలీసులు దుందుడుకు చర్యలకు పాల్పడుతూన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద గ్రామాల్లో ఉన్న ప్రజలకు కొట్టుదిట్టమైన భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.