telangana
ఫోక్సో చట్టం పై విద్యార్థులకు అవగాహన
సూర్య,మంథని రూరల్ :మంథని మండలంలోని ఎక్లాస్ పూర్ గ్రామంలోదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నా న్యాయం విజ్ఞాన సమావేశంలో భాగంగా గురువారం సీనియర్ సివిల్ జడ్జి మల్లాడి అపర్ణ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ఫోక్సో చట్టం బాలల హక్కులపై అవగాహన సదస్సు కల్పించారు.చిన్న పిల్లల పై జరుగుతున్నా సైబర్ నేరాలు,ఫోక్సో చట్టం పై విద్యార్థులకు వివరించారు.బాలికలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ,తమ హక్కుల పట్ల అవగాహన,ఆపద సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆమె వివరించి చట్టపరమైన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం. గొల్లపల్లి జ్యోతి,బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కే.రగోత్తంరెడ్డి,న్యాయవాదులు కట్కం శ్రీనివాస్,శశిభూషణ్ కాచే,కన్నూరి శ్రీహరి,రెండ్ల సతీష్,అశోక్ రెడ్డి, జంజర్ల శేఖర్,కుమార్,తదితరులు పాల్గొన్నారు.