BREAKING
కొటియా మనది, మనమే రక్షించుకుందాం పలు తీర గ్రామాల్లో పర్యటించిన ఎంపీ హరీష్… ఎంపీటీసీ అభ్యర్థి సాసుబల్లి మౌనికను గెలిపించండి *జోరు గాలి వానలోనూ ఇంటింటా ప్రచారం చేసిన టిడిపి పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి కంకణపల్లి అనురాధ. బొప్పాయితో కేవలం జీర్ణక్రియే కాదు.. గుండెకూ ఎంతో మేలు, కానీ వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి! వరద ఉధృతిపై ఎస్పీ తుహిన్ సిన్హా క్షేత్రస్థాయి పర్యటన! మడమల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోనే ఈ సులభమైన చిట్కాలు పాటించండి! ముందస్తు చర్యలు – ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మాణమే లక్ష్యం... మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అనకాపల్లిలో కార్పొరేట్ ఎన్నికలకు సర్వం సిద్ధం. తుపాను దెబ్బకు అప్రమత్తమైన అనకాపల్లి రూరల్ పోలీసులు. పెన్షన్ పంపిణీలో అధికార పార్టీ జోక్యం నివారించాలి భోజనం చేసిన వెంటనే స్నానం చేయవచ్చా.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? సరళ మైసమ్మ దేవాలయ వివాదంపై సంయుక్త విచారణ భారీ వర్షాలతో ఏలేరు కాలువకు పెరిగిన వరద హోరు గాలిలో.. జోరు వానలో... తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత సుడిగాలి పర్యటన

గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి

Select Suryaa Now
గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌సీఎస్‌టీ) అంకిత భావంతో కృషి చేస్తోందని కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని ఆయన సూచించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ కమిషన్ ద్వారా చర్యలు చేపట్టవచ్చనే దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్, సిరికొండ మండలంలోని సర్పంచ్ తండా, గడ్డమీది తండా, కొండాపూర్, గోప్యాతండాను, నవీపేట మండలంలోని మాన్ సింగ్ తండాలను సందర్శించారు. పై ప్రాంతాల్లో గిరిజనులతో మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. ఇంకనూ అందుబాటులోకి రావాల్సి ఉన్న మౌలిక వసతుల గురించి ఆరా తీశారు.అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి (ఐడీఓసీ) చేరుకుని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలతో కలిసి, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గిరిజన సంక్షేమం, హౌసింగ్, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, రహదారులు–భవనాలు, అటవీ, రెవెన్యూ, విద్య, వ్యవసాయం, మున్సిపల్ పరిపాలన, ఎక్సైజ్, పోలీసు శాఖలకు సంబంధించిన సమస్యలపై గిరిజనులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్హులైన గిరిజనులకు జాప్యానికి తావు లేకుండా పక్కా ఇళ్లను కేటాయించాలని, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని అన్నారు. గిరిజన మారుమూల గ్రామాల్లో, తండాల్లో ఎక్కడైనా రక్షిత మంచి నీటి వసతి లేకపోతే, జల్ జీవన్ మిషన్ కింద ప్రతిపాదనలు పంపాలని, కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. రోడ్లు, విద్యా, వైద్యం తదితర సేవల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని సంబంధిత అధికారులకు సూచించారు.
    కాగా, తండాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే స్థానిక అధికారులను సంప్రదించాలని, ప్రజావాణి వంటి ఫిర్యాదుల పరిష్కార వేదికలకు ముందుగా తమ సమస్యలను తెలియజేయాలని, పరిష్కారం లభించని పక్షంలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌ను ఆశ్రయించవచ్చని హుస్సేన్ నాయక్ గిరిజన సంఘాల ప్రతినిధులకు సూచించారు. కమిషన్‌కు సంబంధించిన ఎన్‌సీఎస్‌టీ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అందజేయవచ్చని తెలిపారు.
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కమిషన్ ఉచితంగా, వేగవంతమైన విధానంలో చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, చాలామందికి ఈ విషయం తెలియదని పేర్కొంటూ, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ట్రైనీ కలెక్టర్ సురేష్, జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కల్యాణ్ రెడ్డి, డీఆర్ఓ గీత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.