కరాటే లో బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైన పేరాల అంజన రావు
ఖానాపురం, మేజర్ న్యూస్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్టోబర్ 27న జరిగిన 70వ పాఠశాల క్రీడల్లో 17 ఏళ్లలోపు 40 కిలోల కరాటే విభాగంలో ఖానాపురం మండలానికి చెందిన పేరాల అంజన రావు బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. చిన్నతనం నుండే కరాటేపై మక్కువతో గత 7-8 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకే శిక్షణకు వెళుతూ ఎండ, చలి, వాన అని చూడకుండా ఒక్కరోజు కూడా తప్పకుండా సాధన చేస్తూ అంచలంచలుగా ఎదుగుతూ ఈ ఘనత సాధించింది. ఆమె క్రమశిక్షణ, పట్టుదల, కష్టానికి గురువులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రస్థాయిలో కూడా విజయం సాధించి జాతీయ స్థాయికి వెళ్లాలని అభినందనలు తెలిపారు.
రిపోర్టర్, అనిల్ కుమార్, ఖానాపూర్ వరంగల్ జిల్లా