BREAKING
కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో అప్రమత్తమైన పునరావాస కేంద్రాల ను పరిశీలించిన ఉన్నత అధికారులు రక్తదానం ప్రాణదానం తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం విజయవంతం ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గణేష్ కు శాప్ చైర్మన్ అభినందన . ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. పక్కి గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రచారం ఆధ్యాత్మిక చింతన తోనే మానసిక ప్రశాంతత. బసవ కళ్యాణ్ పీఠాధిపతి శ్రీ మాధవానందా సరస్వతి స్వామి వారు. మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కడుబండి అహంకారం కి కొప్పల వెలమ బలి వైసీపీ పార్టీ కి జగనన్నకి నష్టం కలిగితే ఊరుకోము అన్న మాజీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే "కోండ్రు" తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం-2026 తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు సహాయక చర్యలు అవధానం ఏకాగ్రతను పెంపొందిస్తుంది మెదక్ జిల్లా మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించాలి.

కాలుష్య కోరల్లో ప్రజలు.. స్వచ్ఛమైన గాలి, నీరు ప్రజల హక్కు: ఈటల రాజేందర్‌

Select Suryaa Now
కాలుష్య కోరల్లో ప్రజలు.. స్వచ్ఛమైన గాలి, నీరు ప్రజల హక్కు: ఈటల రాజేందర్‌

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: జవహర్‌నగర్‌ డంప్‌యార్డు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. పాదయాత్ర రెండో రోజు ఘట్‌కేసర్‌ మండల కేంద్రానికి చేరుకున్న ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఘట్‌కేసర్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. స్థానిక పరిశ్రమల వ్యర్థాలు, డంప్‌యార్డు నుంచి వెలువడుతున్న మురుగు కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను బాధితులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ జవహర్‌నగర్‌ డంప్‌యార్డును తొలగించాలంటూ గతంలోనే జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాలని కోరారు. “గాలి పీల్చేది బతకడానికి.. చావడానికి కాదు. కాలుష్యంతో గాలి, నీరు విషతుల్యమవుతున్నాయి. స్వచ్ఛమైన గాలి, నీరు ప్రజల హక్కు” అని పేర్కొన్నారు. కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి, ప్రజారోగ్యాన్ని కాపాడేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌ రెడ్డి, ఘట్‌కేసర్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు కొమ్మిడి మైపాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్‌తో పాటు పలువురు నాయకులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.