BREAKING
అంగవైకల్యాన్ని అధిగమించి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డికి ఘన సన్మానం.. రూ.50 వేల నగదు ప్రోత్సాహకం ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండిలా! రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ కరువు నివారణ చర్యలపై అధికారుల దృష్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్‌ దుస్తుల పంపిణీ అభినందనీయం: పీఏసీఎస్‌ చైర్మన్‌ మన్నె శంకర్‌ యాదవ్‌ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కొత్త సినిమా.. ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ! ఈనెల 30 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్ డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కు భారీ ధర, ఎవరెవరు ఏ జట్టుకంటే? పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు అలియాబాద్‌ 18, 19వ వార్డుల్లో లో వోల్టేజ్‌ సమస్యకు చెక్‌.. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు భూమిపూజ హాలీవుడ్ సంచలనం.. మళ్లీ క్యాట్నిస్‌గా జెన్నిఫర్ లారెన్స్ రీఎంట్రీ నల్లబెల్లి ని కరువు మండలం గా ప్రకటించాలి షఫాలీ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీ.. జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్

ఏసీబీ వలలో లీగల్‌ మెట్రాలజీ అధికారి!*

Select Suryaa Now
ఏసీబీ వలలో లీగల్‌ మెట్రాలజీ అధికారి!*

 

*-రూ.20 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన వెంకటేశ్వర్లు*

*యాదాద్రిభువనగిరి, ప్రతినిధి మేజర్ న్యూస్*
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏసీబీ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. లీగల్‌ మెట్రాలజీ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పెట్రోల్‌ బంకు అనుమతులకు సంబంధించి క్లియరెన్స్‌ కోసం వచ్చిన చింతల యాదగిరిని అధికారి లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదటి విడతగా రూ.20 వేలు ఇవ్వాలని కోరడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం.. బాధితుడి నుంచి నగదు తీసుకుంటున్న సమయంలో వెంకటేశ్వర్లును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయంలో విచారణ చేపట్టింది.