BREAKING
బంట్వారం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా మోహన్ ముదిరాజ్ కాలుష్య కోరల్లో ప్రజలు.. స్వచ్ఛమైన గాలి, నీరు ప్రజల హక్కు: ఈటల రాజేందర్‌ అనురాగ్‌ రోవర్‌ ఫీల్డ్‌ టెస్టింగ్‌ సక్సెస్‌ అసంపూర్తిగా చెర్లగూడ వంతెన! వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ వెనుక ఆ సినిమా డైలాగ్ మ్యాజిక్.. అసలు రహస్యం విప్పిన అభిషేక్ శర్మ కీసరలో అక్రమ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ మెరుపు దాడులు.. ఎక్స్‌కవేటర్, మూడు టిప్పర్లు సీజ్ రక్తదానం ప్రాణదానంతో సమానం... మంగ్రాస్పల్లి సర్పంచ్ స్వప్న రమేష్  నాగార్జున వందో సినిమా టైటిల్ మారుతోందా.. ఖైదీ100 పేరు పరిశీలనలో ఉందా 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జి.కె. మణి ప్రచార జోరు నిహారిక కొణిదెల నిర్మాణంలో నయా మూవీ: ఆసక్తికరంగా 'పాకెట్ రాకెట్స్' టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి* గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి నీళ్లు..కరెంటు లేక రైతులు ఆగం - ఎండిన పొలంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడలో కార్డన్ సెర్చ్ *106 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం 31వ వార్డు అభ్యర్థిని గెలిపించండి... మాండ్ర

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

Select Suryaa Now
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

మునుగోడు,మేజర్ న్యూస్:వార్షిక తనిఖీలో భాగంగా బుదవారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మునుగోడు పోలీస్ స్టేషన్‌ను  సందర్శించి స్టేషన్ పనితీరు, సిబ్బంది విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి మునుగోడు స్టేషన్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కౌంటర్, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల వివరాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి పోలీస్ స్టేషన్ నిర్వహణపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నేరస్థులకు శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేసి, నిర్ణీత గడువులో చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని, పాత నేరస్తులు, రౌడీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి కదలికలను పర్యవేక్షించాలని సూచించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను పటిష్టం చేసి దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు యువత బానిస కాకుండా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 
మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మహిళలపై నేరాలకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులు, కేసు డైరీలు, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, కోర్టు కేసుల వివరాలు, ఇతర ముఖ్యమైన రికార్డులను పరిశీలించి వాటిని ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. ఈ వార్షిక తనిఖీలో జిల్లా ఎస్పీ వెంట నల్లగొండ చండూర్ సీఐ రాము, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్, మునుగోడు ఎస్‌ఐ మొగుళ్ళ శోభన్ బాబు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

కె. ఇంద్రసేనా రెడ్డి,మేజర్ న్యూస్, మునుగోడు,నల్గొండ జిల్లా