BREAKING
రైతులను రారాజులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటీటీలోకి వచ్చేసిన మరో మైండ్ బ్లోయింగ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్: ఏకంగా నాలుగు ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ మానవత్వం చాటిన పంచాయతీ కార్యదర్శులు *ప్రమాదంలో మృతి చెందిన అంజన్న కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 1.38 కోట్లు ఏసీబీ వలలో లీగల్‌ మెట్రాలజీ అధికారి!* రుద్రవనం పీఎస్ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ 35వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో 40 కుటుంబాలు చేరిక సమ్మర్ హాలిడేస్ ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: హీరో శ్రీవిష్ణు 'తులాభారం' సెట్స్‌లోకి అడుగుపెట్టిన రవితేజ.. 'క్రైమ్ మహారాజా'గా నవ శకం ప్రారంభం ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘హై’ మూవీ.. దర్శకుడిగా ఎస్ కృష్ణ సరికొత్త ప్రయత్నం టీడీపీలో చేరిన వైకాపా యువ నాయకులు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. రికార్డు ధర పలికే అవకాశం ఉన్న టాప్ స్టార్స్ వీళ్లే

తప్పుడు ధ్రువపత్రంతో భూమి విరాసత్‌.. కేసు నమోదు

Select Suryaa Now
తప్పుడు ధ్రువపత్రంతో భూమి విరాసత్‌.. కేసు నమోదు

నవాబుపేట సూర్య న్యూస్: తప్పుడు కుటుంబ సభ్యుల ధ్రువపత్రం సమర్పించి తల్లి పేరిట ఉన్న భూమిని తన పేరుపై విరాసత్‌ చేసుకున్న వ్యక్తిపై చీటింగ్‌,ఫోర్జరీ కేసు నమోదైనట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని కూచూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్య గత జూన్‌ నెలలో తప్పుడు కుటుంబ సభ్యుల ధ్రువపత్రాన్ని నవాబుపేట తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించాడు.దీంతో తన తల్లి మల్లమ్మ మరణానంతరం ఆమె పేరిట ఉన్న 8 ఎకరాల 34గుంటల భూమిని తన పేరుపై విరాసత్‌ చేసుకున్నాడు.ఈ విషయమై మృతురాలు మల్లమ్మ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్‌ సురేష్‌ విచారణ చేపట్టారు.విచారణలో రామచంద్రయ్య తప్పుడు కుటుంబ సభ్యుల ధ్రువపత్రం సమర్పించినట్లు గుర్తించడంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.కాగా,రామచంద్రయ్య నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.