telangana
శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 1.38 కోట్లు
సూర్య వేములవాడ ;;వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత 40 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారికి రూ. 1,38,24,600 నగదు ఆదాయం లభించింది.నగదుతో పాటు కానుకల రూపంలో 66 గ్రాముల 200 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 550 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు వెల్లడించారు. ఈ హుండీల లెక్కింపు ప్రక్రియను ఆలయ ఈవో రమాదేవి, కరీంనగర్ దేవాదాయ శాఖ ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజమౌళి, ఆలయ డీఈవో నవీన్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పోలీసులు మరియు శ్రీ శివరామకృష్ణ భజన మండలి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.