మానవత్వం చాటిన పంచాయతీ కార్యదర్శులు *ప్రమాదంలో మృతి చెందిన అంజన్న కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం
*కుటుంబానికి ఉపాధి కల్పిస్తామని కలెక్టర్ హామీ
మేజర్ న్యూస్, మిర్యాలగూడ:
పంచాయతీరాజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ సహోద్యోగులందరితో కలివిడిగా ఉండే పుల్లెంల పంచాయతీ కార్యదర్శి శ్రీపతి అంజన్న ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఆయనమృతిజిల్లాపంచాయతీ కార్యదర్శులు ఉద్యోగులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆయన మృతితో ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా చిన్నాభిన్నమైన నేపథ్యంలో, మేమంతా ఉన్నామనే భరోసా ఇస్తూ జిల్లా పంచాయతీ కార్యదర్శులు యంత్రాంగం యావత్తు మానవతా దృక్పథం తో ముందుకు వచ్చింది.జిల్లా పంచాయతీ అధికారి పిలుపు మేరకు జిల్లాలోని అన్ని మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం, తోచినసహాయాన్ని అందించి మొత్తం రూ. 6,00,000 సమీకరించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ,జిల్లా పంచాయతీ అధికారి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం చెక్కును అందజేశారు.ఈ సందర్భం గా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ "శ్రీపతి అంజన్న లాంటి నిబద్ధత కలిగినఉద్యోగినికోల్పోవడం బాధాకరం. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడం మా బాధ్యత. ఈ ఆర్థిక సాయం తక్షణ సహాయం మాత్రమే. సాధ్యమైనంత త్వరలో కారుణ్య నియామకం, ఏదో ఒక పథకం ద్వారా కుటుంబంలో అర్హులైన ఒకరికి శాశ్వత ఉపాధి కల్పించేలా పూర్తి ప్రయత్నం చేస్తాను" అని హామీ ఇచ్చారు.కలెక్టర్ సహృద య స్పందనకు,చొరవ తీసుకున్న డిపిఓ, ఎ సి ఎల్ బి, రూపాయి రూపాయి కలిపి సహాయం అందించిన ప్రతిపంచాయతీకార్యదర్శులకు ,జిల్లా పంచాయతీ ఉద్యోగులకు మృతుని కుటుంబం తరఫున పంచాయతీ కార్యదర్శుల సంఘంతరఫునహృదయపూర్వకధన్యవాదాలుతెలియనేస్తున్నట్టు జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రధాన కార్యదర్శి డా. పూసపాటి నరేష్ తెలిపారు.