BREAKING
ప్రతి గ్రాడ్యుయేట్ ఓటుతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంగవైకల్యాన్ని అధిగమించి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డికి ఘన సన్మానం.. రూ.50 వేల నగదు ప్రోత్సాహకం ఓటీటీలో భయపెడుతున్న కొత్త హారర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా వీక్షించండి! రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ కరువు నివారణ చర్యలపై అధికారుల దృష్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్‌ దుస్తుల పంపిణీ అభినందనీయం: పీఏసీఎస్‌ చైర్మన్‌ మన్నె శంకర్‌ యాదవ్‌ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కొత్త సినిమా.. ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ! ఈనెల 30 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్ డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కు భారీ ధర, ఎవరెవరు ఏ జట్టుకంటే? పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు అలియాబాద్‌ 18, 19వ వార్డుల్లో లో వోల్టేజ్‌ సమస్యకు చెక్‌.. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు భూమిపూజ హాలీవుడ్ సంచలనం.. మళ్లీ క్యాట్నిస్‌గా జెన్నిఫర్ లారెన్స్ రీఎంట్రీ నల్లబెల్లి ని కరువు మండలం గా ప్రకటించాలి

సమ్మర్ హాలిడేస్ ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: హీరో శ్రీవిష్ణు

Select Suryaa Now
సమ్మర్ హాలిడేస్ ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: హీరో శ్రీవిష్ణు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తాజా చిత్రం "సమ్మర్ హాలిడేస్". మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ చిల్డ్రన్ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తుండగా, నవంబర్ 6న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ను వీక్షించిన అనంతరం హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడాయని, సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. "సమ్మర్ హాలిడేస్" కథ విన్నప్పటి నుంచే ఈ మూవీని రాజీ పడకుండా క్వాలిటీగా తీయాలని భావించామని తెలిపారు. అమ్మమ్మ పాత్రలో నటి జయసుధ ఒదిగిపోయారని, వాసుకి గారి క్యారెక్టర్ చూస్తుంటే తన మదర్ గుర్తుకువచ్చారని భావోద్వేగంతో పేర్కొన్నారు. అలాగే హర్షవర్థన్, రాజీవ్ కనకాల, హర్షిణి వంటి ప్రతిభావంతులైన ఆర్టిస్టులు తమ అద్భుతమైన నటనతో సినిమాకు మరింత వాల్యూ తీసుకొచ్చారని తెలిపారు. చిన్నపిల్లల సినిమా ఎందుకు చేస్తున్నావని, థియేటర్స్ కు జనం వస్తారా అని మిత్రులు అడిగారని, అయితే ఇలాంటి సినిమా హిట్ అయితే ఇండస్ట్రీకి వందమంది శ్రీకర్ లాంటి కొత్త దర్శకులు వస్తారని అన్నారు. ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నప్పటికీ ఎవరూ చేసేందుకు ముందుకురావడం లేదని, ఇతర భాషల్లో ఇలాంటి సినిమాలు వస్తే చూసి ఎంజాయ్ చేస్తున్నామని తెలిపారు.

తమ సినిమా ఘన విజయం సాధిస్తుందనే సూపర్ కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ అంతా ఉందని ధీరజ్ మొగిలినేని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా విజయవంతం అయిన తర్వాత ఇలాంటి మంచి సినిమాలు నెలాకొకటి చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తాయని వెల్లడించారు. ప్రేక్షకులంతా తమ కుటుంబాలతో కలిసి థియేటర్స్ కు వచ్చి ఈ సినిమాను తిలకించి ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చారు. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా అని, పిల్లల కంటే అనేక రెట్లు పెద్దలు ఈ చిత్రాన్ని ఆస్వాదిస్తారని చెప్పారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టదని, నిర్మాతగా ఇదొక ప్రామిస్ అని స్పష్టం చేశారు. గ్రేట్ సినిమా హిస్టరీలో వెంకటేష్ సంక్రాంతి సినిమా సంక్రాంతికి రాలేదని, నాని దసరా సినిమా దసరాకు రాలేదని, అలాగే తమిళంలో దీపావళి అనే సినిమా ఆ పండుగకు రిలీజ్ కాలేదని, ఎస్వీ కృష్ణారెడ్డి ఉగాది సినిమా ఉగాదికి రాలేదని గుర్తుచేశారు. అదే విధంగా తమ "సమ్మర్ హాలిడేస్" కూడా సమ్మర్ కు రాలేదని, కానీ ఆ క్లాసిక్ సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.