BREAKING
అంగవైకల్యాన్ని అధిగమించి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డికి ఘన సన్మానం.. రూ.50 వేల నగదు ప్రోత్సాహకం ఓటీటీలో భయపెడుతున్న కొత్త హారర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా వీక్షించండి! రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ కరువు నివారణ చర్యలపై అధికారుల దృష్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్‌ దుస్తుల పంపిణీ అభినందనీయం: పీఏసీఎస్‌ చైర్మన్‌ మన్నె శంకర్‌ యాదవ్‌ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కొత్త సినిమా.. ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ! ఈనెల 30 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్ డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కు భారీ ధర, ఎవరెవరు ఏ జట్టుకంటే? పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు అలియాబాద్‌ 18, 19వ వార్డుల్లో లో వోల్టేజ్‌ సమస్యకు చెక్‌.. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు భూమిపూజ హాలీవుడ్ సంచలనం.. మళ్లీ క్యాట్నిస్‌గా జెన్నిఫర్ లారెన్స్ రీఎంట్రీ నల్లబెల్లి ని కరువు మండలం గా ప్రకటించాలి షఫాలీ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీ.. జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్

రుద్రవనం పీఎస్ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్

Select Suryaa Now
రుద్రవనం పీఎస్ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ ڈెస్క్: ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు రమేష్ పుప్పాల, సూర్యకాంతి సంయుక్తంగా నిర్మించిన నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. శశిధర్ మున్నంగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో బుధవారం రోజున అత్యంత వైభవంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ అండ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రచార చిత్రాన్ని, కంటెంట్‌ను ప్రశంసించారు. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను మించి అత్యంత పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ నిర్మాత రమేష్ పుప్పాల గారిని మళ్లీ ఈ రూపంలో చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘మిరపకాయ్’ సినిమా సమయంలో రమేష్ గారు తనకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని గుర్తుచేసుకున్నారు. అలాగే రాజా రవీంద్ర అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. నిర్మాత వివేక్ కూచిభోట్ల తనకు సొంత ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారని, ఆయన శ్రీమతి సూర్యకాంతి గారు ఈ సిరీస్‌ ద్వారా నిర్మాతగా పరిచయం కావడం సంతోషదాయకమని అన్నారు.

దర్శకుడు శశిధర్ ఈ సిరీస్‌తో గొప్ప విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. తాను ఇప్పటికే ‘రుద్రవనం పీఎస్’ కంటెంట్ చూశానని, ప్రతీ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ఉంటూ ఊహించిన దాని కంటే పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.కథానాయకుడు నరేష్ అగస్త్య మాట్లాడుతూ పన్నెండేళ్ల క్రితం జీ5 వేదికగా ‘పసుపు కుంకుమ’ ప్రాజెక్ట్‌తో తన ప్రయాణం ప్రారంభమైందని, ఆ తర్వాత ‘పరువు’, ‘వికటకవి’ వంటి సిరీస్‌లు చేశానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ‘రుద్రవనం పీఎస్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సుదీర్ఘ జర్నీలో తనకు నిరంతరం సపోర్ట్ అందించిన జీ5 టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాతలు సూర్యకాంతి, రమేష్ పుప్పాలకి కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శకుడు శశితో తాను ఎన్నో కథలను చర్చించానని, ఆయన వద్ద మరిన్ని అద్భుతమైన కథలు ఉన్నాయని వెల్లడించారు. శశి, అష్కర్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని, సిరీస్‌లోని ప్రతీ ఒక్క నటుడు ప్రాణం పెట్టి నటిస్తూ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారని చెప్పారు.

అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని కోరారు.   దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ ‘రుద్రవనం పీఎస్’ అత్యంత గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిందని వివరించారు. కథలోని మలుపులు, సన్నివేశాల చిత్రీకరణ వీక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు. ప్రతీ ఎపిసోడ్ చివరి వరకు ఇంట్రెస్టింగ్‌గా సాగుతూ, తెలుగు డిజిటల్ స్పాట్‌లో ఒక గొప్ప క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విలక్షణమైన పాత్రలతో, బలమైన నటీనటులతో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ ప్రియులను, థ్రిల్లర్ జోనర్ అభిమానులను విశేషంగా అలరించేందుకు సిద్ధంగా ఉంది.