BREAKING
కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఎంపీటీసీ ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు చిన్నగంజాం మండలంలో పోలీంగ్‌ బూత్‌లు పరిశీలన పెద్దపంజాణి ఎంపీటీసీ అభ్యర్థులు వీరే 57వ డివిజన్‌లో షేక్ అస్మా మస్తాన్ ఎన్నికల ప్రచారం.. భారీ ర్యాలీ రాజమండ్రి నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు నెర్రలు బారిన పొలాలు.. రైతన్న కన్నీళ్లు! 31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత. చిన్నగంజాం మండలంలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు జడ్పీ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడాలి: టీడీపీ నేతల పిలుపు అద్దంకిలో తెదేపాకి వెల్లువలా పెరుగుతున్న మద్దతు. కాకాని అశోక్‌కు బులియన్ మర్చంట్, టైలర్స్ యూనియన్ పూర్తి మద్దతు. కొనగళూరు లో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన 30 కుటుంబాలు అయ్యవారిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన

Select Suryaa Now
ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరండాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్, ఐఏఎస్ అధికారి పుప్పాల ప్రశాంతి మంగళవారం ఆలమూరు మండలంలోని హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.

ఎన్నికల నిర్వహణలో భాగంగా అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను  మంగళవారం ఆమె పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తూ, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఆమె పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఆర్వో) డి. లక్ష్మీ ప్రత్యూష, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(ఏఆర్వో), ఎంపీడీవో ఏ.రాజు, తాసిల్దార్ కందుల కుశరాజు,ఆలమూరు ఎస్సై జి నరేష్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.