BREAKING
కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఎంపీటీసీ ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు చిన్నగంజాం మండలంలో పోలీంగ్‌ బూత్‌లు పరిశీలన పెద్దపంజాణి ఎంపీటీసీ అభ్యర్థులు వీరే 57వ డివిజన్‌లో షేక్ అస్మా మస్తాన్ ఎన్నికల ప్రచారం.. భారీ ర్యాలీ రాజమండ్రి నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు నెర్రలు బారిన పొలాలు.. రైతన్న కన్నీళ్లు! 31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత. చిన్నగంజాం మండలంలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు జడ్పీ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడాలి: టీడీపీ నేతల పిలుపు అద్దంకిలో తెదేపాకి వెల్లువలా పెరుగుతున్న మద్దతు. కాకాని అశోక్‌కు బులియన్ మర్చంట్, టైలర్స్ యూనియన్ పూర్తి మద్దతు. కొనగళూరు లో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన 30 కుటుంబాలు అయ్యవారిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం

ఆసుపత్రి పరిశుభ్రత అందరి బాధ్యత

Select Suryaa Now
ఆసుపత్రి పరిశుభ్రత అందరి బాధ్యత

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రి పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు పేర్కొన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్  ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరంలో కాయకల్ప  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, వైద్య విద్యార్థులకు ఆసుపత్రి పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, చేతుల శుభ్రత, ఇన్ఫెక్షన్ల నియంత్రణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిశుభ్రత కేవలం పారిశుధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది, వైద్య విద్యార్థులు సహా ప్రతి ఒక్కరి  బాధ్యత అని స్పష్టం చేశారు. పరిశుభ్రమైన వాతావరణం ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని తగ్గించడంతోపాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. హరప్పా, మొహెంజోదారో నాగరికతల్లో కనిపించిన ప్రణాళికాబద్ధమైన పట్టణ నిర్మాణం, మురుగునీటి పారుదల వ్యవస్థలు పరిశుభ్రత ప్రాముఖ్యతను చాటుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కాయకల్ప లక్ష్యాలను విధి నిర్వహణలో భాగంగా ఆచరించాలని పిలుపునిచ్చారు.మైక్రోబయాలజీ విభాగాధిపతి డా. ఎం. భారతి మాట్లాడుతూ బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేర్వేరుగా సేకరించి సురక్షితంగా పారవేయడం ద్వారా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని వివరించారు. అపరిశుభ్రమైన చేతుల ద్వారా సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున సరైన పద్ధతిలో సరైన సమయంలో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. పాథాలజీ విభాగాధిపతి డా. బి. కిరణ్మయి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్య పరిరక్షణకు పునాది అని తెలిపారు.కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. వి.వి. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రోగిని తాకడానికి ముందు, తాకిన తర్వాత, రోగి సంరక్షణలోని కీలక సందర్భాల్లో చేతుల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సిబ్బంది అవసరమైన సందర్భాల్లో హ్యాండ్ శానిటైజర్‌ను వినియోగించాలని తెలిపారు. డా. బి. శ్రీనివాస్ నాయక్ కాయకల్ప కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానాలను వివరిస్తూ, పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల సక్రమ పారవేత, ఇన్ఫెక్షన్ నియంత్రణ, నాణ్యమైన వైద్య సేవలు ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై సిబ్బంది, విద్యార్థులకు ఆచరణాత్మక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, వైద్య విద్యార్థులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.