BREAKING
కంకణాలపల్లిలో రైతు గోదాం నిర్మాణానికి శంకుస్థాపన ఎస్సై కి ఘన సన్మానం కిల్లర్ సినిమా చూశాక ఆ అనుభూతితో థ్రిల్ అవుతారు: డైరెక్టర్ పూర్వాజ్ ఇంటర్వ్యూ విశేషాలు ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకూడదు : అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు నగరం మండలంలో 33 మంది ఎంపీటీసీలు పోటీ *తుఫాను వేళ .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *మధిర మున్సిపల్ కమిషనర్ కె.శామ్యూల్ పాల్** డాక్టర్ వృత్తిని వదిలి నటిగా ఎందుకు మారారు.. సాయిపల్లవిపై రణ్‌బీర్ కపూర్ అదిరిపోయే కౌంటర్ బాపట్ల జిల్లా బీచ్ లు తాత్కాలికంగా మూసివేత - అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్ సీట్లు సర్దుబాటులో సమన్వయం ఏది కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఎంపీటీసీ ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు చిన్నగంజాం మండలంలో పోలీంగ్‌ బూత్‌లు పరిశీలన పెద్దపంజాణి ఎంపీటీసీ అభ్యర్థులు వీరే 57వ డివిజన్‌లో షేక్ అస్మా మస్తాన్ ఎన్నికల ప్రచారం.. భారీ ర్యాలీ రాజమండ్రి నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు

అభిషేక్ శర్మ వీరంగం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం!

Select Suryaa Now
అభిషేక్ శర్మ వీరంగం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం!

వెల్లింగ్టన్:న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజృంభించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీమిండియా 3-0 తేడాతో సొంతం చేసుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది. డారిల్ మిచెల్ (89 నాటౌట్) రాణించడంతో కివీస్ భారత్‌కు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగి కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 113 పరుగులు చేయగా, మరో యువ ఓపెనర్ వైభవ్‌ సూర్యవంశీ 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. సంజూ శాంసన్‌ 18 పరుగులు చేశారు.

ఓపెనర్ల ధాటికి భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.