కంకణాలపల్లిలో రైతు గోదాం నిర్మాణానికి శంకుస్థాపన
కోటపల్లి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కంకణాలపల్లి గ్రామంలో రైతు గోదాం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పంటల నిల్వకు అవసరమైన సదుపాయాలు కల్పించి, వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యంగా గోదాం నిర్మాణాన్ని చేపడుతున్నట్లు గ్రామ సర్పంచ్ పట్లొల్ల రాజేందర్ రెడ్డి తెలిపారు. గోదాం అందుబాటులోకి వస్తే రైతులు తమ పంటలను భద్రపరుచుకోవడానికి వీలవుతుందని, తద్వారా వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్లొల్ల రాజేందర్ రెడ్డి, కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నర్సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.